BJP Protest on Farmer Guarantee Implementation : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు ముగిసిందని, ఆయన ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అభయ్ పాటిల్ అన్నారు. ఆయన ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ తుగ్లక్ రేవంత్ రెడ్డి అని ఎద్ధేవా చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ధ బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతు హామీల సాధన దీక్షకు హాజరైన అభయ్ పాటిల్, నిమ్మరసం ఇచ్చి పార్టీ ప్రజాపత్రినిధుల దీక్షను విరమింపజేశారు.