సామాజిక మాధ్యమాలపై సర్కార్​ ఫోకస్ - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు​ పెడితే జైలుకే!

2024-10-01 1

Congress Complaint on Social Media Handles : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులతోపాటు సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని యూట్యూబ్‌ చానళ్లు వాస్తవ విరుద్ధమైన అంశాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి అన్వయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ చేస్తుండడంతో పలు వీడియోలపై కాంగ్రెస్‌ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.