Congress on New PCC Group : సమర్థవంతమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 3 ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్షలు నిర్వహించిన కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మిగిలిన జిల్లాల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర నాయకత్వం, దిద్దుబాటు చర్యలు చేపట్టింది.