నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని.. ముఖ్యమంత్రి ప్రారంభించారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని.. సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు