TDP Central Office Attack Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమి తెలియదని బుకాయించిన ఆ పార్టీ నేతల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారికి వైఎస్సార్సీపీ నేతల ఖాతా నుంచి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగగా వారు నిరాకించినట్లు తెలిసింది.