BSFI Courses Launch In Telangana Today : డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఏటా అనేకమంది విద్యాసంస్థల నుంచి బయటకొస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సంపాదించవచ్చు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ(బ్యాకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.