AP HC Rejected Vijay Pal Bail Petition : రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్ర హింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ఆయన అభ్యర్థను న్యాయస్థానం తోసిపుచ్చింది. విజయ్‌పాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అరోపణలు అందోళనకరమైనవి, తీవ్రమైనవని స్పష్టంచేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట విరుద్ధంగా వ్యవహరించి పౌరుల జీవనాన్ని, స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వర్తించేందుకు అధికారులకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి లైసెన్సూ ఇవ్వలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.