War Of Words Between BRS Cong On PAC Chairman Post : ప్రజా పద్దుల కమిటీ సమావేశం సందర్భంగా ఛైర్మన్ పదవిపై మళ్లీ అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ సభ్యులు అరికెపూడి గాంధీ అధ్యక్షతన మొదలైన సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు పనులు బయటపెట్టి అసెంబ్లీకి నివేదిస్తామనేక ఇస్తామనే పదవి దక్కకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసాలు బయటకు వస్తాయనే పీఏసీ ఛైర్మన్ పదవిపై గులాబీ నేతలు నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు.