ప్రయాణికులతో కిక్కిరిసిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ - గేట్లు మూసివేత

2024-09-17 1

Huge Crowd at Metro Stations : భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గణనాథులను చివరిసారిగా దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో నిమజ్జనానికి వచ్చారు. ఈ క్రమంలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను నిర్వాహకులు మూసివేశారు. పది నిమిషాలకు ఓసారి మెట్ల వద్ద గేట్లు తెరిచి ప్రయాణికుల్ని లోనికి అనుమితిస్తున్నారు.