నేను ఫామ్​హౌస్​ ముఖ్యమంత్రిని కాదు - పనిచేసే ముఖ్యమంత్రిని : సీఎం రేవంత్​ రెడ్డి

2024-09-17 2

Praja Palana Dinotsavam 2024 : తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవ్వరూ తప్పు పట్టవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇచ్చామన్న ఆయన, పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. హైడ్రాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Videos similaires