Mahesh will Take Charge as PCC President : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా రేపు మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులు, మంత్రులు, దీపాదాస్ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు.