Boats Removal At Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటీ మధ్యాహ్నానికి ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తికానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి మరో రెండు పడవల కోతను ప్రారంభించనున్నారు. భారీ పడవలు ధృడంగా ఉండటం వల్ల పనులు పూర్తయ్యేందుకు మూడు రోజుల పడుతుందని అధికారులు చెబుతున్నారు.