Huge Demand for Lord Ganesh Clay Idols : రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. తొమ్మిదిరోజులపాటు విశేష పూజలందుకునే లంబోదరుడు మండపాల్లో కొలువుదీరాడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కొందరు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపాడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టిగణపయ్యకు డిమాండ్ బాగానే పెరిగింది.