ఎలా ఉన్నావు? అని అడగడం బదులు జ్వరం తగ్గిందా అని అడిగే పరిస్థితి వచ్చింది!

2024-09-05 0

Viral Fever Cases Increasing in Telugu States : వర్షాకాలం! దీనికి మరో పేరు వ్యాధుల కాలం. వాతావరణ మార్పుల కారణంగా ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలడమే అందుకు కారణం. కానీ, ఈ ఏడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సీజనల్‌ వ్యాధుల విజృంభణ అధిక స్థాయిలో ఉంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది మంచాన పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, నిమోనియాలూ రోగుల చుట్టుముడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జలుబు లేదా జ్వరంతో బాధపడుతున్నారు. రోగుల తాకిడితో ఆసుపత్రుల్లోని ఒక్కో బెడ్డును ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తోన్న పరిస్థితులు ఉన్నాయి. మరి విషజ్వరాలు ఈ స్థాయిలో విజృంభించడానికి కారణాలేంటి? వీటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది?