వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

2024-09-02 0


AP CM Chandrababu Inspected Vijayawada Flood Areas : ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ వరదకు అతలాకుతలం అయింది. బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.