భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

2024-09-01 4

Godavari River Water Level Rises : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.