CM Revanth Reddy Review On RRR Alignment : రీజినల్ రింగు రోడ్డు దక్షిణభాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లకు భూసమీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రైపోర్ట్, బందరు-కాకినాడ రేవుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం తెలిపారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.