Dairy Farmers Protest In Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సంఘం డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సంఘం డైరీ ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా స్థానిక పాడి రైతుల నుంచి నిరసన ఎదురైంది. రైతులను మోసం చేసి తక్కువ ధరకు వేలం దక్కించుకున్నారని మండిపడ్డారు. పాత బకాయిలు చెల్లించాకే ప్రారంభం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు.