Officials Frauds In Vemulawada Temple : వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయశాఖ అధికారుల లీలలు ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో తప్పిదాలను గుర్తించి పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.