తిరుపతి స్విమ్స్‌లో జూనియర్ వైద్యురాలిపై దాడి

2024-08-25 2

Doctors Protest Tirupati SVIMS : తిరుపతిలోని స్విమ్స్‌ వైద్యశాలలో ఓ మానసిక రోగి ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి చేయడంతో వైద్యులు, జూడాలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలంటూ అత్యవసర విభాగం ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం వైద్యుల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.