Posters Against Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని చేసినందున బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని హైదరాబాద్లో పోస్టర్లు వెలిసిన ఘటన కలకలం రేపింది. బేగంపేట, రసూల్ పురతో పాటు పలుచోట్ల ఇవి దర్శనమిచ్చాయి. గతంలో హరీశ్ రావు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేయాలని ఆ పోస్టర్లో ఉంది.