బాలాపూర్‌ రౌడీషీటర్ హత్య కేసును చేధించిన పోలీసులు - తొమ్మిది మంది అరెస్టు

2024-08-15 9

Nine Arrested in Balapur Murder Case : నీళ్ల ప్లాంటు ఏర్పాటులో గొడవతో మొదలైన కక్ష సుపారీ ఇచ్చి హత్య చేయించే వరకు దారితీసింది. ప్రత్యర్థిని హతమారిస్తే తమకు తిరుగుండదని, తుపాకీతో కాల్చి చంపితే పెద్ద రౌడీలమైపోతామని నిందితులు భావించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఆలోచనలతోనే హైదరాబాద్‌ బాలాపూర్‌లో రౌడీషీటర్ ఖాజా రియాజుద్దీన్‌ను హతమార్చినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.