Telangana Cabinet Expansion Latest : తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ పదవి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని వరించవచ్చని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఓసీలకు పెద్దపీట వేస్తారని సమాచారం.