TDP Leader Srinu Murder in Kurnool: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత, మాజీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లు, మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. వైఎస్సార్సీపీ మూకలు దారుణంగా హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని సాయంత్రానికి నిందితులను పట్టుకుంటామని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.