Harish Rao Fires on Congress Government : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనిని కాంగ్రెస్ నేతలు తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కరవుని పారదోలాలన్న లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించారని, ఆ ఘనతను కాంగ్రెస్ విజయంగా సృష్టించుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు.