Godavari Second Phase Works : హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండోదశ పనులకి ప్రభుత్వం గీన్ సిగ్నల్ ఇచ్చింది. 2050 పరిస్థితిని అంచనా వేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీలను నగరానికి తరలించేందకు సర్కారు రెండోదశ పని మొదలుపెట్టనుంది. ఇందుకోసం రూ.5,560 కోట్లు మంజూరుచేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి రెండో దశ పనుల వల్ల నగరానికి తాగునీటితోపాటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలకు పునరుజ్జీవం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.