ఇప్పటికే ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు - అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

2024-08-01 366

SC ST Sub Classification 2024 : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాదిగ, అందులోని ఉపకులాలు 27 ఏళ్లకు పైగా చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందని అన్నారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ విజయం ఎన్నో ఏళ్లుగా ఈ క్షణం కోసం పోరాటం చేసి అమరులైన ఎమ్మార్పీఎస్ సోదరులకు అంకితం ఇస్తున్నట్లు మందకృష్ణ చెప్పారు.