సన్నబియ్యం కొనుగోళ్లపై అసెంబ్లీలో వాడివేడి చర్చ - బీఆర్ఎస్, బీజేపీ లేకుండానే పద్దులకు ఆమోదం

2024-07-31 48

Discussion On Civil Supplies in Telangana Assembly : ధాన్యం సేకరణ, సన్నబియ్యం కొనుగోళ్ల అంశం శాసనసభను అట్టుడికించింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. టెండర్ల వ్యవహారంపై సభాసంఘం వేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీజేపీ కూడా వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ సభ నుంచి పారిపోయిందని పాలకపక్షం మండిపడింది.