రైతుల నిరీక్షణకు తెర - రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల

2024-07-30 134

Telangana Govt Released Second Installment Crop Loan Funds : అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కానుంది. 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్లు జమ చేశారు. తొలివిడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.