GHMC Field Survey In Greater Hyderabad : రాష్ట్ర రాజధానిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ నేటి నుంచి ఇంటింటి సర్వే చేయబోతుంది. ఇటీవల జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా సర్వేను మొదలుపెట్టిన బల్దియా రెవెన్యూ విభాగం, ఇవాళ్టి నుంచి ఇంటింటికి వెళ్లి భవన నిర్మాణ అనుమతులతో పాటు ఆస్తి పన్ను రశీదులను పరిశీలించనుంది.