తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్ - మాజీ సీఎస్ సోమేశ్ కుమార్​పై కేసు నమోదు

2024-07-29 359

Case Filed Against Somesh Kumar in GST Scam : జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ నిందితులుగా ఉన్న ఈ కేసులో ఐదో నిందితుడిగా సోమేశ్‌ కుమార్‌ను చేర్చారు. వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని మరీ వీరు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.