Chevireddy Mohith Reddy Arrested: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో కీలక ముందడుగు పడింది. వైఎస్సార్సీపీ నాయకుడు, నానిపై పోటీ చేసి ఓటమిపాలైన మోహిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి తనయుడుని అదుపులోకి తీసుకుని తిరుపతి తరలించారు.