Ministers Visited Flood Affected Areas: పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది. ఏలూరు జిల్లాలోని పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనిత, పార్థసారథి నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలనూ పరిష్కరిస్తామన్న అచ్చెన్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. పెదవాగు సమస్య కూడా తీరుస్తామని భరోసా కల్పించారు.