అప్పుల లెక్కలు ఓకే - అమ్మకాల సంగతేంటి? : రేవంత్

2024-07-27 668

CM Revanth Reddy Budget Session 2024 Speech : గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్​ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్​ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్​ రెడ్డి ఘాటుగా స్పందించారు.
కేసీఆర్​కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్​ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్​ఎస్​ నేతలను సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.

Videos similaires