Telangana Lands Value Increase : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు సర్వం సిద్ధమైంది. అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ విలువ పెద్దగా పెరిగే అవకాశం లేకపోగా, ఖాళీ స్థలాలపై బాదుడు అధికంగా ఉంటుందని తెలుస్తోంది. జోన్ల వారీగా సమీక్షలు పూర్తి చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రూ.4వేల కోట్లలకు పైగా అదనంగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. కనీసం 30 శాతం పెరుగుదల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది కొన్ని చోట్ల 50 శాతం అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం జరిగి అనుమతిస్తే పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.