మాదాపూర్​లో రేవ్​ పార్టీ భగ్నం - భారీగా డ్రగ్స్ స్వాధీనం! - rave party breaks out in madhapur

2024-07-25 240

Rave Party Busted In Madhapur : మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్​టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. పట్టుబడ్డ వారి నుంచి రెండు లక్షల రూపాయల విలువ చేసే విదేశీ మద్యం,1 గ్రాము కొకైన్,2 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్,0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను శేరిలింగంపల్లి ఆబ్కారీ శాఖ పోలీస్​ స్టేషన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆ శాఖ జాయింట్​ కమిషనర్​ ఖురేషి వెల్లడించారు.