రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ?

2024-07-25 263

Telangana Budget 2024 : అన్నదాత అభ్యున్నతి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. మొత్తం 2 లక్షల 91వేల 59 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వ్యవసాయానికి అత్యధికంగా సుమారు 25 శాతం నిధులు కేటాయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా పాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలకు నిధులు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు సైతం దండిగానే నిధులు కుమ్మరించింది.