Telangana Assembly Sessions 2024 : బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర వివక్ష చూపిందని కాంగ్రెస్ మంత్రులు ఆక్షేపించారు. విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారని, తెలంగాణకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఈ కేటాయింపులపై బాధ్యత వహిస్తూ బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.