ఫోన్ ​ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ప్రభాకర్​రావుపై రెడ్​కార్నర్​ నోటీసుకు యత్నాలు

2024-07-21 211

Phone Tapping Case Update : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్‌రావును హైదరాబాద్‌ రప్పించే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు సీఐడీ ద్వారా సీబీఐను దర్యాప్తు అధికారులు అభ్యర్ధించారు. సీబీఐ ఈ అభ్యర్ధనను ఇంటర్‌పోల్‌కు పంపాల్సి ఉంటుంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసే అవసరం ఉందని భావిస్తే రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేస్తుంది.