Telangana Govt to Take up Musi Riverfront Development : హైదరాబాద్కు తలమానికంగా నిలిచే మూసీ నది అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1.50 లక్షల కోట్ల రూపాయలతో మూసీ నది అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పదేళ్లలో మూసీనదిని చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకురావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.