Telangana Weather Report Today : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.