Reasons for Brutal Murder in Vinukonda: పల్నాడు జిల్లాలో జరిగిన దారుణ హత్యకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఇద్దరివీ పక్క పక్క ఇళ్లే అని, రెండేళ్ల క్రితం జరిగిన ఓ చిన్న గొడవ కక్షలకు ఆజ్యం పోసిందని సమాచారం. నాటి బాధితుడే నేడు పగతో ప్రత్యర్థిని నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.