హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం

2024-07-18 230

Heavy Rain In Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.