Doctors Provided Medical Services : వైద్యో నారాయణో హరిః వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజం డాక్టర్లను గౌరవంగా చూస్తారు. ఆ పేరుకు తగ్గట్లుగానే ములుగు జిల్లా వైద్యులు చేసిన పని ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ములుగు జిల్లా పెనుగోలు గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పైగా ఆ గ్రామం నుంచి రావాలంటే వర్షాలు అడ్డంకింగా మారాయి. దీంతో గ్రామస్థుల దగ్గరికే వైద్యులు వెళ్లారు. అందుకోసం కాలినడకన కొండలూ గుట్టలు దాటి కుండపోతగా కురిసే వర్షంలో తడస్తూ, ప్రమాదకరమని తెలిసినా లెక్క చేయక వాగులు దాటి వైద్య సేవలందించి సెహబాష్ అనిపించుకుంటున్నారు.