బీజేపీ రాష్ట్ర సారథిపై హైకమాండ్‌ కసరత్తు - రేసులో కీలక నేతలు

2024-07-17 5

Telangana BJP State New President Selection 2024 : బీజేపీ రాష్ట్ర రథసారథిపై హస్తినలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి ముందే రాష్ర్ట అధ్యక్షుడిని నియమించే యోచనలో అధిష్ఠానం నిమగ్నమైంది. కేంద్రమంత్రులు, ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పలురాష్ట్రాల అధ్యక్షుల స్థానంలో కాషాయ పార్టీ కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా హరియాణా రాష్ర్ట అధ్యక్షుడిగా మోహన్‌ లాల్‌ బడోలీని ఎంపిక చేసింది. ఈ ఎంపికతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. శ్రావణ మాసం ప్రారంభంలో నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.