CM Revanth Review With Party Leaders : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంపై అధికార కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నా, అదే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో పార్టీ నాయకులు దృష్టి సారించటంలేదని పీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్‌లో సమావేశం కానున్న సీఎం, కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.