BJP Reacted On Crop Loan Waiver Rules : రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్ కార్డు ఉండాలనే నిబంధనలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తప్పుబట్టారు. రూ.34 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. కొత్తగా నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ నిబంధనలే రైతుకు ఉరితాడుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.