Job Aspirants Protest in Hyderabad : చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నగర కేంద్ర గ్రంథాలయానికి చేరుకున్నారు. లైబ్రరీ నుంచి నిరసన ప్రదర్శన చేయడానికి బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురుని పోలీసులు అరెస్టు చేశారు.