కిడ్నాప్‌ చేసి కుక్కలతో బెదిరించి - ఎమ్మార్పీఎస్ నాయకుడు కేసులో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు

2024-07-15 461

MRPS Leader Kidnap Case Update : యజమానిని బెదిరించి భూ కబ్జా అంతటితో ఆగకుండా అందులోనే అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మాణం. దాని చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ, సీసీ కెమెరాలు ఏర్పాటు, లోపలికి వెళ్లగానే భీతి గొలిపేలా పదుల సంఖ్యలో శునకాలు. ఎవరైనా ఎదురుతిరిగితే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం. ఇదీ ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన దుండగుల దుశ్చర్య. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.