రీల్స్ మోజులో భార్య - హత్య చేసిన భర్త - వీడిన ఉప్పల్​ మర్డర్ మిస్టరీ

2024-07-14 225

Man killed Wife For Making Reels in Uppal : రియల్‌ లైఫ్‌ని"రీల్స్‌ లైఫ్‌"గా మార్చుకుంటూ కొంత మంది వాటికి బానిసలుగా మారుతున్నారు. తమ వీడియోలకు లైకులు, త్వరగా వైరల్‌ అయ్యేందు తహతహలాడుతూ సామాజిక మాధ్యమాలకు బంధీలైపోతున్నారు. పొద్దున లేచింది మొదలు ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఆతృతలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేక పోతున్నారు. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా పోతున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలతో బంధాలు బీటలు బారుతున్నాయి.